మాదిగలకు 12% రిజర్వేషన్ ను బే షరతుగా అమలు చేయాలి

మాదిగలకు 12% రిజర్వేషన్ ను బే షరతుగా అమలు చేయాలి

కాజిపేట్ తెలంగాణ ముచ్చట్లు:

 ఎస్సీ వర్గీకరణ విషయమై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ను బేషరతుగా అమలు చేయాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాల వికాస్ కేంద్రంలో మాదిగల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మైసా. ఉపేందర్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీ, ప్రజాసంఘాల, కుల సంఘాల నాయకులతో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిలుగా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి. రవి, వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో మాదిగ లకు అన్యాయం జరగకుండా వెంటనే ప్రభుత్వం చొరవ చేసుకొని మాదిగలకు ఉద్యోగ విద్య రాజకీయ రిజర్వేషన్లు 12% కు పెంచి అమలు చేయాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో టి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బోట్ల. బిక్షపతి మాదిగ, జనగాం నర్సింగ్, ఉద్యోగ సంఘాల నాయకులు గోవింద్, నవీన్ కుమార్, వీరస్వామి, బండ శ్రీనివాస్, జన్ను మధు, గంగారపు అమృత రావు, ఆరూరి రంజిత్, పరంజ్యోతి లతోపాటు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .