మన సంస్కృతికి ప్రతీక బోనాలు- ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మహిళలతో కలసి బోనమెత్తిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

మన సంస్కృతికి ప్రతీక బోనాలు- ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.బోనాల పండుగ సందర్భంగా ఆదివారం దేవరుప్పుల మండలం,సీతారాంపురం గ్రామంలో గ్రామస్థులు కుల పెద్దల ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బోనమెత్తి పోచమ్మ తల్లికి సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుందని గ్రామ మహిళలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఆ గ్రామ దేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు బాగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవతలను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు,గ్రామ శాఖ అధ్యక్షుడు వరికెలా రతన్ జీ,మండల నాయకులు ఉప్పుల సురేష్ బాబు,కాసారపు ధర్మారెడ్డి, మామిడాల తిరుపతి రెడ్డి,రెడ్డి రాజుల రమేశ్,దావేర అనిల్ కుమార్,తోటకూరి పాండు కృష్ణ,ఆవుల సురంజన్ రెడ్డి,బోనగిరి యాకస్వామి,బిసిసెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్,పులిగిల్ల వెంకన్న,యూత్ నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకురాళ్ళు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .