గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఘనంగా సేవాలాల్ సేన పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జిల్లా అధ్యక్షుడు ధరావత్ శంకర్ నాయక్
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:
ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ శంకర్ నాయక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.సోమవారం సేవాలాల్ సేన దేవరుప్పుల మండల కమిటీ ఆధ్వర్యంలో ధారావత్ తండాలో సేవాలాల్ సేన మండల అధ్యక్షులు కొనసోత్ బిక్కు నాయక్ ధరావత్ స్వామి నాయక్ లు సేవాలాల్ సేన పదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవలాల్ సేన జనగామ జిల్లా ధరావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ సెంట్రల్ కమిటీ కమిటీ ఆదేశానుసారం పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.బంజారా జాతి కోల్పోతున్న సంప్రదాయ సంస్కృతిని పరిరక్షిస్తూ గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మరియు జాతి మనుగడతో పాటు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా సేవాలాల్ సేన పనిచేస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీలను వెంటనే అమలు చేయాలని గిరిజన లంబాడీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.10% గిరిజన రిజర్వేషన్ పెంపు G. Oనెంబర్ 33 కు చట్టబద్ధత కల్పించి అన్ని రంగాలలో అమలు చేయాలినీ నూతనంగా ఏర్పడ్డ తండా గ్రామపంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని అన్నారు.తండా అభివృద్ధి బోర్డ్ ఏర్పాటు చేయాలని పంచాయతీ పరిధిలో అన్ని శాఖల ఉద్యోగాలు గిరిజనులచే భర్తీ చేయాలని మైదాన ప్రాంత గిరిజనుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఐటిడిఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాలను గౌరవించి మంత్రి పదవి కేటాయించి నామినేటెడ్ పదవులలో సముచిత స్థానాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన డీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కున్సోత్ లక్ష్మణ్ నాయక్ మాజీ సర్పంచ్ గేమ టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వాంకుడోత్ దేవునాయక్ నాయక్ ,కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు దరావత్ రవీందర్ నాయక్ బిజెపి గిరిజన మోర్చా మండల అధ్యక్షులు మూడ అన్వేష్ నాయక్ దేవు నాయక్ బిచ్చ నాయక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments