సారూ జర చూడు మా రోడ్డు
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
ఈ రహదారిలో ఉన్న కల్వర్టులో ప్రయాణం కష్టతరంగా ఉంది
ఈ రోడ్డుపై నాలుగు సార్లు తిరిగితే నడ్డి విరిగాల్సిందే
గత పాలకులు ఆదమరిచారు. ఈ పాలకులు ఆరంభమే లేదు
గతుకుల రోడ్లు గందరగోల ప్రయాణంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
నియోజకవర్గానికి కాస్త దూరంలో స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని తానేదార్ పల్లి, విశ్వనాథపురం, తీగారం, ఈ గ్రామాల రోడ్డు పాలకులకు కానరావడం లేదా...?
గ్రామాల్లో ప్రధాన రహదారుల పరిస్థితి చాలా అధ్వానంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్లపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలతో రాత్రి వేళల్లో అటు వైపు వెళ్ళే వాహనదారులు గమ్యం చేరటం ప్రమాదకరంగా మారింది. ఇది గతంలో మట్టిని తరలించిన టిప్పర్ లారీల వల్ల ఇప్పుడు గ్రామం సూరారం గ్రామం మధ్యలో మైనింగ్ పెద్దపెద్ద లారీలు గ్రానైట్ తీసుకోవడం వల్ల భారీ గుంతలు ఏర్పడుతున్నాయి దీనిని ఏ అధికారులు పట్టించుకోవడం లేదు దీనికి తోడు ఈ గ్రామం వైపు ఉన్న రహదారికి కల్వర్టుల సమస్య ఇప్పటికీ గ్రానైట్ ను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.
ప్రతి రోజు రాత్రి, పగలు అధిక సంఖ్యలో టిప్పర్లు అధిక లోడుతో ఈ రోడ్లపై ప్రయానిస్తుండటంతో రోడ్డు ధ్వంసమై ప్రమాదకర స్థాయిలో గుంటలు ఏర్పడ్డాయి. ప్రజలు ప్రశ్నించిన ప్రతి సారి గుంతలను తాత్కాలికంగా మట్టితో పూడుస్తున్నప్పటికి, అధిక లోడ్ టిప్పర్ల వల్ల కొద్దీ రోజులకే తిరిగి గుంటలు ఏర్పడుతున్నాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా గుంటలను మట్టితో కాకుండా తారు తో పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా వెళ్ళాలని ప్రజలు సూచిస్తున్నారు.
*నాలుగు సార్లు తిరిగితే నడ్డి విరిగాల్సిందే*
రహదారిలో రెగ్యులర్‌గా వాహనాల్లో తిరిగితే మాత్రం నడ్డి విరగాల్సిందే. నడుం చుట్టూ బెల్టు బిగించాల్సిందే.. అంతటి ఘోరంగా ఉంది ఆ రహదారి.. వర్షాలకు ఏర్పడిన గుంతలకు ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆ రహదారిలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది.
*నిత్యం రద్దీగా ఉండే రహదారి*
ఈ రహదారి ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ రోడ్లపై ఏర్పడిన గతుకులు గుంతల వల్ల ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు, రోడ్ల దుస్థితి తమ నడ్డిని విరుస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం వలన వాహనాలకు పదేపదే టైర్లు మార్చాల్సి వస్తోంది. పదే పదే సర్వీస్ చేయించడం వల్ల, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల అయ్యే ఖర్చు భరించలేకున్నామని తమ బాధను వ్యక్తపరిచారు. రోజూ ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగే ఆటోవాలాల పరిస్థితి కూడా ఇంతేనని చెప్పుకొచ్చారు. ఈ రోడ్లలో సుమారు మూడు నుండి నాలుగు అంగుళాల లోతులో గుంతలు ఉండటం, అందులో ఉన్న కాంక్రీట్ రాళ్లు కూడా బయటకు రావడంతో వాహనదారులు వాహనాన్ని అదుపు చేయడం కష్టతరం కావడం వల్ల పదేపదే ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఇదే రోడ్డుపై యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్ మట్టిని తరలించడం ద్వారా ఈ రోడ్లకు ఈ దుస్థితి ఏర్పడిందని, ఇసుకకు రవాణా వాహనాలకు చలానాల ద్వారా రుసుము వసూలు చేసే ప్రభుత్వ యంత్రాంగం కాస్త ఈ రోడ్ల దుస్థితిని పరిశీలించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే బాగుంటుందని ప్రతిఘటించారు. రానుంది వర్షాకాలం కావడంతో ఇప్పుడే రోడ్ల మరమ్మతులను పూర్తి చేయకుంటే ఈ రోడ్లు మరింత దుస్థితికి చేరుకుని రవాణా కష్టతరం అవుతుందని వాహనదారులు వ్యాఖ్యానించారు. ఇకనైనా ఆర్ అండ్ బి అధికారులు గతుకుల రోడ్డుపై దష్టి పెట్టి గోతులను గుంతలను పూడ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
*ప్రయాణికుల గోడు*
ఎటు చూసినా ఏముంది.. గతుకులు.. అతుకులే.. ద్విచక్రవాహనంపై వెళ్లాలన్నా గగనమే.. లేచిపోయిన రాళ్లు.. పేరుకుపోయిన మట్టి.. పక్కపక్కనే కనీకనిపించకుండా గోతులు..
ఈ రహదారుల్లో ప్రయాణికులు మాత్రం నరకం చూస్తున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్డు.. ఆ రోడ్డుపై తిరిగితే.. బైక్ అయినా కారు అయినా షెడ్డుకు తీసుకెళ్లాల్సిందే.. ఇలా ఏ రోడ్డు చూసినా అధ్వానమే.. అయినా అటు నాయకుల్లోనూ.. ఇటు అధికారుల్లోనూ కదలిక లేదు.. అయ్యా నాయకులు గడపగడపకూ కాదు.. రోడ్డు రోడ్డుకు వెళ్లండి.. సమస్యను పరిష్కరించండి.. అని అంటున్న ప్రయాణికులు.
*సానుకూలంగా స్పందించిన కడియం*
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు మంగళవారం నాడు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బెలెదే వెంకన్న , ఆధ్వర్యంలో తానేదార్ పల్లి గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రోడ్డు ప్రీతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ
విశ్వనాదపురం నుండి తమ్మడపల్లి (జీ) వరకు ఉన్న రోడ్డు ను డబల్ రోడ్ గా మార్చి మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యేను కోరామని అంతేకాకుండా గ్రామంలో డబల్ సీసీ రోడ్డు కూడా వేయవలసిందిగా కోరడంతో
దీనిపై వెంటనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారని అతి త్వరలోనే పూర్తి చేస్తానని పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు కూడా కచ్చితమైన హామీ ఇచ్చాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్చుడు ఎన్రెడ్డి లింగారెడ్డి , మాజీ సర్పంచ్ గాదె చంద్రయ్య, ముఖ్య నాయకులు మాజీ ఉప సర్పంచ్ మంతెన ఇంద్రసేన రెడ్డి -హరిత, మాజీ వార్డ్ మెంబర్స్ ఉప అధ్యక్షుడు చుక్క రమేష్, మంతెన హరీష్, ఆకుల సంధ్య-కృష్ణం రాజు, దుంపల పద్మ రెడ్డి, మాచర్ల కుమార స్వామి, మార్క రాజు, బాస్కుల నర్సయ్య, గాదె సుధాకర్,ఆకుల నవీన్ ,గజావెల్లి దయాకర్, ఇల్లందుల అరుణ్ , చిరంజీవి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్
రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పాల్గొన్నారు.


Comments