సామినేని రామారావు హంతకులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం..
సిపిఎం నేతలుధ్వజం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇందుకు భాద్యత వహించేల్సిందే
రామారావు ను చంపినంత మాత్రాన ఎర్రజెండా లేకుండా చేస్తామనేది వాళ్ళ భ్రమ
వాళ్ళు కుక్క చావు చవక తప్పదు.. ప్రజలు వారిని సోషల్ బాయ్ కట్ చేయాలి
ప్రపంచం అంతా ఎర్రజెండా వైపు చూస్తుంది
ఖమ్మం బ్యూరో, నవంబర్ 8, తెలంగాణ ముచ్చట్లు;
సిపిఎం సీనియర్ నేత చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావును చంపిన హంతకులను పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం ఉందని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు ………సామినేని రామారావు సంతాపసభశనివారం పాతర్లపాడు గ్రామంలో జరిగింది………ఈ సభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, తదితరులు కాంగ్రెస్ పార్టీ వారే తమ నేతను హత్య చేశారని ఆరోపణలు చేశారు.
రామారావుది రాజకీయ హత్య కాదంటున్న పోలీస్ కమిషనర్ మరి హంతకులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన రాజకీయ నాయకుడి లా మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ అంటే ప్రేమ ఉంటె కాకి చొక్కాలు వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాలని హితవు పలికారు ..చనిపోయిన రామారావు భార్య స్వయంగా పోలీసులకు ఫలానా, ఫలానా వాళ్ళు తన భర్త హత్యకు కారణమని లిఖితపూర్వకంగా రాసి ఇస్తే వాటి మీద చర్యలు తీసుకోకుండా ఆమెను కుటుంబసభ్యులను వేధిస్తున్నారని ఇదెక్కడి న్యాయం భాదితులకు అండగా ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ కు వత్తాసు పలకడం ఏమిటని నిలదీశారు ……… అవసరమైతే పోలీసుల తీరుపై ప్రవేటు కంప్లైంట్ వేస్తామని రామారావు కుమారుడు విజయ్ సభముఖంగా పోలీసులకు హెచ్చరికలు చేశారు ………
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ,ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే ,ఇక్కడ రామారావు ఉండగా తమ ఆటలు సాగవని భావించిన ప్రత్యర్థులు ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకు దారుణం గా హత్య చేశారని అన్నారు………కొంతమంది ఆగంతకులు గొంతు కోసి చంపడం అదికూడా తెల్లవారుతుండగా చంపాడమంటే అత్యంత ప్రణాళిక ప్రకారం జరిపారని అన్నారు..ఈ హత్యను పొలిట్ బ్యూరో కూడా ఖండించింది తెలిపారు .. మృదు స్వభావి శత్రువుతో సహితం మర్యాదగా మాట్లాడే రామారావు దుర్మార్గంగా పొట్టన పెట్టుకున్న దుండగులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యంపై విమర్శలు చేశారు..ప్రత్యర్థులు ఏ రాజకీయ కక్షతో హత్య చేశారో, అదే రాజకీయ కక్షతో దెబ్బకొట్టాలని రాఘవులు పిలుపు నిచ్చారు ..రాష్ట్రంలో హోమ్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉందని, ఇక భట్టి డిప్యూటీ సీఎం గా ఉన్నారని ఇదే జిల్లాకు చెందిన పొంగులేటి కోటరీలో సభ్యుడుగా ఉన్నారని ధ్వజమెత్తారు హత్య జరిగి 9 రోజులు గడుస్తున్నా చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వమా ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు .. భట్టి విక్రమార్క అదే రోజు హత్యను ఖండిస్తూ ప్రకటన చేశారు హంతకులను పెట్టుకోకుండా ప్రకటనలు చేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కమ్యూనిస్టులు అయితే ..దోచుకునే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని మనం వాళ్ళను ప్రజల్లోనే ఎండగట్టాలని అన్నారు..
సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్,పాలడుగు భాస్కర్, సిపిఎం ఖమ్మం ,కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు నున్న నాగేశ్వరావు, మచ్చా వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా సహాయ
కార్యదర్శిజమ్ముల జితేందర్ రెడ్డి,న్యూడెమోక్రసీ నాయకులు మధు సిపిఎం నాయకులు, పి.సోమయ్య, బుగ్గవీటి సరళ, రామారావు సతీమణి సామ్రాజ్యం ,కూతురు, కోడలు, సిపిఎం జిల్లా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, విక్రమ్, కనకయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సభకు సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మదుపల్లి గోపాల్ రావు అధ్యక్షత వహించారు


Comments